సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (18:19 IST)

బిగ్ బాస్ హోస్ట్ ఎవరబ్బా.. నాగ్ ప్లేసులో అక్కినేని పెద్ద కోడలా.. లేకుంటే?

కింగ్ నాగార్జున ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్నారు. తన కొత్త చిత్రం వైల్డ్‌ డాగ్‌ షూటింగ్ కోసం నాగార్జున అక్కడకు వెళ్లారు. అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగార్జున గైర్హాజరీలో `బిగ్‌బాస్-4` వీకెండ్ కార్యక్రమాన్ని ఎవరు హోస్ట్ చేస్తారనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. 
 
ఈ నేపథ్యంలో నాగార్జున హిమాలయాల్లో రోహ్‌తంగ్ పాస్‌లో తీసిన వీడియోను నాగార్జున ట్విటర్‌లో షేర్ చేశారు. సముద్ర మట్టానికి 3980 మీటర్ల ఎత్తులో తాము ఉన్నామని, ఇది చాలా డేంజరస్ ప్రాంతమని నాగార్జున పేర్కొన్నారు.
 
నవంబర్ నుంచి మే వరకు ఆ ప్రదేశాన్ని మూసేస్తారని, వైల్డ్ డాగ్ షూటింగ్ ఇక్కడ ప్రస్తుతం చాలా బాగా జరుగుతోందని తెలిపారు. ఏడు నెలల తర్వాత ఇలాంటి అద్భుతమైన ప్లేస్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని, 21 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తామని పేర్కొన్నారు. 
 
దీంతో నాగార్జున ఈ శని, ఆదివారాలతో పాటు మరో రెండు వారాలు బిగ్‌బాస్‌ షోకు రాలేనట్టు చెప్పాడు. ఇపుడా నాగార్జున ప్లేస్‌లో అక్కినేని పెద్ద కోడలు సమంత అక్కినేని.. బిగ్‌బాస్‌ షోను హోస్ట్ చేయనున్నట్టు స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి. మరి బిగ్‌బాస్ షో హోస్ట్‌గా సమంత ఏ లెవల్లో ఇరగదీస్తుందో చూడాలి.