గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 మార్చి 2023 (15:18 IST)

మనం చేసే పని మనకు మంచి పీఆర్ అవుతుంది : యామీ గౌతమ్

yami gautham
మనం చేసే మంచి పని మనకు మంచి పబ్లిక్ రిలేషన్ అవుతుంది అని హీరోయిన్ యామీ గౌతమ్ అన్నారు. పలు తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు సుపరిచితులైన యామీ గౌతమ్‌కు ఓ అభిమాని "మంచి పీఆర్‌ను నియమించుకోండి" అంటూ సలహా ఇచ్చారు. దీనికి ఆమె తనదైనశైలిలో రిప్లై ఇచ్చింది. 
 
"పీఆర్ కార్యకలాపాలు, సమీక్ష, ధోరణి, అవగాహన, ఇమేజ్‌పై ఆధారపడే నటులను చూశాను. అయితే నేను ఎవరినీ జడ్జ్ చేయడం లేదు. కానీ, నీవు చేసే పని నీకు మంచి పీఆర్ అవుతుంది" అని నేను నమ్ముతాను. ఇది సుధీర్ఘమైన బాట. అయినా కానీ, సరైన దిశగా ముందుకు తీసుకెళుతుంది అని పేర్కొంది. అంటే, తనకు పీఆర్ టీమ్ అక్కర్లేదంటూ ఆమె ప్రత్యేకంగా చెప్పకనే చెప్పింది. కాగా, ఆమె లాస్ట్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఇది అనిరుద్ధ రాయ్ చౌదరి తీశారు. ఈ నెల 24వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకానుంది.