శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (18:18 IST)

మామా మశ్చీంద్ర లో సుధీర్ బాబు మరో షేడ్ ఇదే

Sudhir Babu in Mama Mashchindra
Sudhir Babu in Mama Mashchindra
సుధీర్ బాబు, హర్ష వర్ధన్ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి పై సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ‘మామా మశ్చీంద్ర’లో  మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా వున్నారు.
 
ఇప్పటికే లావుగా ఉన్న దుర్గ క్యారెక్టర్ పోస్టర్‌ కి విశేషమైన స్పందన వచ్చింది. ఈ రోజు, మేకర్స్ పరశురామ్ క్యారెక్టర్ పోస్టర్‌ ను విడుదల చేయడం ద్వారా రెండవ సర్ప్రైజ్‌ తో ముందుకు వచ్చారు. చేతిలో తుపాకీ పట్టుకొని ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్‌ లా కనిపిస్తున్నారు సుధీర్ బాబు. ఆయన డ్రెస్సింగ్ , సిట్టింగ్ స్టైల్ , సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ ఆకట్టుకున్నాయి. డీజే గా థర్డ్ లుక్ ఈ నెల 7న విడుదల కానుంది.
 
తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఒక అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, పిజి విందా సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్.