శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 29 మే 2019 (18:18 IST)

వైఎస్ఆర్ ఘాట్ నుంచి యాత్ర-2 ప్రారంభం

"యాత్ర" సినిమాను వైఎస్ఆర్ పాదయాత్రను ఆధారం చేసుకుని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. రాజశేఖర్ తండ్రి రాజారెడ్డి మరణించాక ప్రారంభమైన ఈ "యాత్ర" రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆపై మరణం, జగన్ ఎంట్రీతో ముగిసింది. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా దర్శకుడు మహి 'యాత్ర 2'ను తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు.
 
"యాత్ర 2" సినిమాకు స్టోరీ లైన్ ఎక్కడి నుండి ప్రారంభించబోతున్నారనే విషయం చెప్పకనే చెప్పాడు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఇడుపులపాయలో ఆయన తండ్రి సమాధి దగ్గరి నుంచి పాదయాత్రను ప్రారంభించడం, ఇంకా అనేక విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు దర్శకుడు మహి తెలియజేసాడు. అయితే, ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని దర్శకుడు చెప్పలేదు.