శైలజారెడ్డి అల్లుడు సెకండ్ సింగిల్ రెడీ..!
అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస
అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. గోవాలో చైతు, అనూ ఇమ్మాన్యుయేల్ పైన ఒక రొమాంటిక్ సాంగ్‌ను శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు. ఈ పాట యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందంటున్నారు చిత్ర యూనిట్.
ఈ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పార్ట్ పూర్తయింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి ట్విట్టర్లో స్పందిస్తూ... సెకండ్ సింగిల్‌ను ఈ నెల 16న రిలీజ్ చేయనున్నాం. ఈ పాట కూడా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అన్నారు. ఇక ఈ మూవీని గ్రాండ్‌గా ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. అంచనాలకు తగ్గట్టుగా శైలజారెడ్డి అల్లుడు అందర్నీ ఆకట్టుకుంటాడని ఆశిద్దాం.