శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (15:42 IST)

''24 కిస్సెస్'' ప్రేమకు బలమా..? రివ్యూ రిపోర్ట్ ఎలా వుంది..

సినిమా పేరు: 24 కిస్సెస్ 
తారాగాణం: ఆదిత్ అరుణ్, హెబ్బా పటేల్, నరేష్, రావు రమేష్, శ్రీని, మధు నెక్కంటి తదితరులు
నిర్మాణ సంస్థలు : సిల్లీ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ 
సంగీతం : జోయ్ బారువా,
నిర్మాతలు : సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి 
దర్శకత్వం : అయోధ్యకుమార్ కృష్టం శెట్టి 
 
అయోధ్యకుమార్ కృష్టం శెట్టి రూపొందించిన సినిమా ''24 కిస్సెస్''. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా 24 కిస్సెస్‌ను దర్శకుడు రూపొందించాడు. ఈ సినిమాలో ముద్దులకు కొరవేలేదని పెద్ద దుమారం రేగింది. అయినా సినిమాలో ఏదో కథ వుందని యూనిట్ చెప్తూ వచ్చింది. మరి ప్రపంచ వ్యాప్తంగా 23వ తేదీ (శుక్రవారం 23-11-2019)న విడుదలైన 24 కిస్సెస్ సినిమా కథేంటో చూద్దాం.. 
 
ఆనంద్ (అరుణ్ అదిత్) కాలేజీల్లో సినిమాలకు సంబంధించిన క్లాస్‌‌లు చెప్తుంటాడు. ఈ క్రమంలో అక్కడ స్టూడెంట్ శ్రీలక్ష్మి (హెబ్బా పటేల్) పరిచయం అవుతుంది. సినిమాపై కోర్స్ చేస్తున్న ఆమె.. ఆనంద్ ప్రతిభకు పడిపోతుంది. అతని ప్రేమలో పడుతుంది. ఇంతలో ఓ రోజు శ్రీలక్ష్మిని ఇష్టపడిన ఆనంద్.. ఆమె తలపై ముద్దు పెట్టుకుంటాడు. దాంతో బుగ్గపై వేరొక చోట ముద్దు పెట్టకుండా.. ఎందుకు తలపై ముద్దు పెట్టాడని రీసెర్చ్ చేస్తుంది శ్రీలక్ష్మి. గూగుల్‌లో సెర్చ్ చేస్తుంది. లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదువుతుంది. అక్కడ ఆమెకు ఓ కొత్త విషయం తెలుస్తోంది. 
 
అదే 24 కిస్సెస్ కాన్సెప్ట్. ఎవరైనా 24 ముద్దులు పెట్టుకుంటే.. ఆ ప్రేమ జంట విడిపోదని తెలుస్తుంది. అది నిజమో కాదో చూద్దామని.. ఆమె, అతను ముద్దులు పెట్టుకునే ప్రోగాం మొదలు పెడతారు. అలా సక్సెస్‌ఫుల్‌గా 23 ముద్దులు పెట్టుకుంటారు. ఇంతలో శ్రీలక్ష్మి ఓ విషయం అర్థం అవుతుంది. అతనికి ముద్దులపైన వున్న ఆసక్తి.. తనపై లేదని.. అతడు ప్రేమలో లేడని తెలుసుకుంటుంది. 
 
అంతేగాకుండా ప్రేమ, పెళ్లి అంటే ఇష్టం లేదని.. అతనికి మరో ముగ్గురు అమ్మాయిలతో శారీరక సంబంధం వుందని తెలుసుకుంటుంది. దాంతో అతనికి దూరమవుతుంది. అయినప్పటికీ అతడిపై ఆమెకున్న ప్రేమ తరగదు. కానీ అతడు మాత్రం సహజీవనం చేద్దామంటాడు. కానీ ఆ ప్రపోజల్‌కు శ్రీలక్ష్మి ఒప్పుకుంటుందా.. ఆ 24వ ముద్దు పెట్టుకున్నారా.. వారి ప్రేమ చివరకు ఏమైంది.. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
విశ్లేషణ.. 
24 కిస్సెస్ కాన్సెప్ట్ కోసం ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేలా దర్శకుడు చేశాడు. కానీ సీన్ సీన్‌కు సంబంధం లేదు. డైలాగులకు అర్థం పర్థం లేదు. ఫస్టాఫ్ ముద్దులు పెట్టుకోవడంతో సరిపోతుంది. రెండో అర్థభాగంలో.. చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టి శుభం కార్డ్ వేసేస్తాడు. ఇందులో హీరో క్యారెక్టర్ గందరగోళంగా వుంటుంది. పిల్లలు అనాధలుగా మారుతున్నారని.. అందుకే పెళ్లి వద్దని సహజీవనం చేద్దామంటాడు. 
 
కానీ సినిమాలో భావోద్వేగాలు మిస్సయ్యాయి. సినిమా నరేషన్ బాగోలేదు. అయోధ్య సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడనే చెప్పాడు. కానీ స్టోరీ లేకపోయినా.. గ్లామర్, కిస్సులతో ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా వుంది. కానీ సినిమాటోగ్రఫీ బాగుంది. ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫీని చాలా రిచ్‌గా చూపెట్టడంలో సక్సెస్ అయ్యారు. 
 
హీరో అదిత్ లుక్ బాగుంది. కానీ క్యారెక్టర్‌లో జోష్ కనిపించలేదు. హెబ్బా పటేల్ పాత్ర సినిమాలో డమ్మీగా మిగిలిపోయింది. ముద్దు సీన్స్‌కు తప్ప వేరెందుకు పనికి రాలేదు. రావు రమేష్ సైక్రియాటిస్ట్ పాత్ర కామెడీగా అనిపిస్తుంది.
 
ప్లస్ పాయింట్స్ 
కొత్త కాన్సెప్ట్ 
 
మైనస్ పాయింట్స్ 
డైరక్షన్
కథాగమనం
హీరో పాత్రలో జోష్ లేకపోవడం 
హీరోయిన్ ముద్దులకే పరిమితం కావడం 
స్క్రిప్ట్‌లో బలం లేకపోవడం. 
 
రేటింగ్- 2/5