Daily Horoscope
✕

'నాకేమైనా మావిడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి' .. 'జంబలకిడి పంబ' టీజర్

హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమై, కథానాయకుడిగా అలరిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నటించిన తాజా చిత్రం 'జంబలకిడిపంబ'. సిద్ధి ఇద్నానీ కథానాయిక. జేబీ మురళీ కృష్ణ(మను) దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణజరుపుకొంటున్న

Written By pnr
Updated: శుక్రవారం, 4 మే 2018 (10:55 IST)
హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమై, కథానాయకుడిగా అలరిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నటించిన తాజా చిత్రం 'జంబలకిడిపంబ'. సిద్ధి ఇద్నానీ కథానాయిక. జేబీ మురళీ కృష్ణ(మను) దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణజరుపుకొంటున్న ఈ చిత్ర టీజర్‌ను గురువారం యువ కథానాయకుడు నాని విడుదల చేశారు.
 
నిజానికి గతంలో ఇదే పేరుతో ఓ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి దివంగత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎంతో ప్రజాధారణ పొందింది. బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను కితకితలు పెట్టి గుక్క తిప్పుకోనీయకుండా నవ్వించేసింది. ఆ సినిమాకు సంబంధించి టెలివిజన్‌లో ఒక్క సీన్‌ వచ్చినా చాలు ఇప్పటికీ పడిపడి నవ్వేస్తారు. ఇప్పుడు ఇదే పేరుతో శ్రీనివాస్ రెడ్డి హీరోగా వస్తున్న చిత్రమే ఈ 'జంబలకిడి పంబ'. 
 
'నాకు విడాకులు కావాలి సర్' అంటూ కథానాయిక అంటే, 'నాకేమైనా మావిడాకాలు కావాలా? నాకు విడాకులే కావాలి' అంటూ శ్రీనివాస్‌రెడ్డి వేసే పంచ్‌ కితకితలు పెడుతుంది. ఇక టీజర్‌లోని పాత్రలు, వారు పలుకుతున్న సంభాషణలు చూస్తుంటే సినిమాను ఆద్యంతం నవ్వులు పంచేలా కట్ చేశారు. 
 
గోపీ సుందర్‌ సంగీత బాణీలు సమకూర్చగా, శివమ్‌ సెల్యులాయిడ్‌, మెయిన్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రవి, జోజో జోస్‌, ఎన్‌.శ్రీనివాసరెడ్డి, బి. సురేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, షకలక శంకర్‌, సత్యం రాజేశ్‌, ధనరాజ్‌, ప్రకాష్‌రెడ్డి, హరితేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Helia Fattahi: గర్భవతినని నిజం చెప్పింది.. కన్నకూతురును కడతేర్చిన తల్లిదండ్రులు

నీ భర్త నిన్ను వేధిస్తున్నాడా? నాతో వచ్చేయ్ అంటూ చేయి పట్టుకున్న బోయ్‌ఫ్రెండ్, భర్త దాడి వీడియో

ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు.. కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్‌లో నవంబర్ నెలలోనే అత్యంత భారీ వర్షం

బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఓవరాక్షన్.. డ్రైవర్‌ను కాలితో తన్నడం ఏంటి? వీడియో వైరల్

అన్నీ చూడండి

శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్

ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్

కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?

నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

తర్వాతి కథనం
Show comments