శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (12:15 IST)

మన్యం రాజు టీజర్ సినిమా చూడాలనెలాఉంది : దగ్గుపాటి సురేష్ బాబు

jeevan, sureshbabu and others
jeevan, sureshbabu and others
జీవన్ హీరోగా, బేబీ పరిణిక, సోమ సుందరం.బి యమ్, ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం మన్యం రాజు  వాయుపుత్ర ఆర్ట్స్ బ్యాన‌ర్ పై, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది.  రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో టీజర్ సురేష్ బాబు చేతులమీదుగా రిలీజ్ చేయటం జరిగింది.
 
సురేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా టీజర్  చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. ప్రొడ్యూసర్ కి  మరియు డైరెక్టర్ కి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా లో పని చేసిన వాళ్ళ అందరికి అల్ బెస్ట్ చెప్తున్నాను అన్నారు. 
 
హీరో సప్తగిరి మాట్లాడుతు టీజర్ చాల బాగా వచ్చింది ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
 
హీరో జీవన్ మాట్లాడుతూ సురేష్ బాబు  గారి  చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉంది .  సినిమా చాల బాగా వచ్చింది. మీకు తప్పకుండ నచ్చుతుంది అని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన  మా ప్రొడ్యూసర్ గారికి  , మరియు డైరెక్టర్ సోము గారికి  థాంక్స్ చెప్తూకుంటున్నాను.
 
దర్శకుడు సోమసుందరం.బి యమ్, మాట్లాడుతూ " మా సినిమా టీజర్ విడుదల చేసిన సురేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదలు , కష్టపడి సినిమా చేశాం . టీజర్ కూడా బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.  మా హీరో జీవన్ , గారు మరియు ప్రొడ్యూసర్  గారు  ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని జయించాను అనే అనుకుంటున్నాను " అని అన్నారు. నా నా మీద నమ్మకం తో  ఈ అవకాశాన్ని  ఇచ్చిన ప్రొడ్యూసర్ కి కూడా థాంక్స్ చెప్తున్నాను.
 
 ప్రొడ్యూసర్స్ విజయ్ బాబు , ప్రవీణ్, భీమాస్ అశోక్  మాట్లాడుతూ, మేము అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది సినిమా , జీవన్ కెరీర్ లో మరొక మంచి సినిమా అవుతుంది అని మేమంతా గట్టిగా నమ్ముతున్నాం" అని అన్నారు ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుంది.  ప్రస్తుతం పోస్ట్  ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని  మే  లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాము.  ఈ కార్యక్రమ లో పరిపూర్ణానంద స్వామి,యం వి వి సత్యనారాయణ,  లయన్ వెంకట్ గారు ,ప్రద్యుమ్న పాల్గొన్నారు.