బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (16:08 IST)

దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలా రాశీ ఖన్నా

Rashi Khanna, Pakka Commercial,
`ప్ర‌తి రోజు పండ‌గే` స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా `పక్కా కమర్షియల్`.  గోపీచంద్ హీరో. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు నిర్మాత‌గా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రాశీ ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. 
 
ఈ టీజర్ మేకింగ్ చాలా రీ ఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇందులో హీరోయిన్ రాశీ ఖన్నా ఆకాశం నుంచి నేలపైకి వస్తున్న దేవకన్యలా కనిపిస్తున్నారు. ఈమె క్యారెక్టర్‌ను ప్రతిరోజూ పండగే మాదిరే ఇందులోనూ మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. గోపీచంద్ పాత్రను కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు మారుతి. టీజర్‌లోనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 
 
కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వస్తుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌.  మార్చ్ 18న సినిమా విడుదల కనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.