ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (15:33 IST)

గౌతమ్ క్లాప్ కొడితే.. సితార చిందేసింది.. మహేష్ 25వ చిత్రం ప్రారంభం (Video)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోస్‌లో జరిగాయి. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించే ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోస్‌లో జరిగాయి. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించే ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్ - 'దిల్' రాజుల సారథ్యంలోని శ్రీవైజయంతీ మూవీస్ - శ్రీవేంకటేశ్వర ఫిలిమ్స్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 
అతిరథమహారథుల సమక్షంలో ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభంకాగా, ఇందులో మహేష్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితార ప్రధాన ఆకర్షణగా నిలిచారు. గౌతమ్ క్లాప్ కొట్టగా, సితార ఎప్పటిలా అల్లరి చేస్తూ సెట్టంతా కలియతిరుగుతూ చిందులు వేసింది. 
 
మరోవైపు.. ఈ చిత్ర హీరోయిన్‌పై ఇంకా ఓ స్పష్టత రాలేదు. కానీ కీర్తి సురేశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ నుంచే హీరోయిన్‌ను తీసుకుందామని అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారని వినికిడి. ఈ మధ్య కాలంలో తమిళంలో పాపులర్ అయిన హీరోయిన్‌ను తీసుకుందామని అనుకుంటున్నారట. 
 
తమిళంలో కీర్తి సురేశ్ దూసుకుపోతోంది. అంతేకాదు తెలుగులో రెండు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న ఆమె, ప్రస్తుతం 'మహానటి'తో పాటు పవన్ మూవీ చేస్తోంది. కనుక మహేశ్ 25వ సినిమాలో కథానాయికగా ఛాన్స్ కీర్తి సురేశ్‌కి దక్కవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.