సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (15:23 IST)

బెంగుళూరురో 10 మంది సౌతాఫ్రికా పౌరులు అదృశ్యం

దేశంలో కరోనా వేరియంట్లలో ఒకటైన ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సౌతాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసింది. ఆ తర్వాత బెంగుళూరులో తొలిసారి ఈ కేసులు నమోదమయ్యాయి. ఇపుడు దేశవ్యాప్తంగా 40 అనుమానిత ఒమిక్రాన్ రోగులను గుర్తించారు. వీరిలో 28 మంది మహారాష్ట్రలోనూ 12 మంది ఢిల్లీలో ఉన్నారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో గత నెల 12 నుంచి 22వ తేదీల మధ్య బెంగుళూరుకు వచ్చిన 10 మంది సౌతాఫ్రికా వాసులు ఆచూకీ తెలియడం లేదు. వారు మొబైల్స్ కూడా స్విచాఫ్ చేసివున్నాయి. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు కర్నాటక ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ వ్యక్తుల ఆచూకీ గుర్తించేందుకు పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. అదేసమయంలో నవంబరు 22వ తేదీ నుంచి అన్ని ఎయిర్‌పోర్టుల్లో గట్టి నిఘా సారించారు.