Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వివాహం జరిగి 14 రోజులైంది... పెళ్లి చేసిన అర్చకుడితో కొత్త పెళ్లికూతురు జంప్..

Updated: శుక్రవారం, 31 మే 2019 (13:28 IST)
వివాహం జరిగి 14 రోజులైంది. అంతే పెళ్లి చేసిపెట్టిన అర్చకుడితో కొత్తపెళ్లి కూతురు పరారైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, అజాద్ అనే గ్రామంలో గత ఏడో తేదీన ఓ జంటకు వివాహం జరిగింది. ఈ వివాహానికి ఆ ప్రాంతానికి చెందిన ఓ ఆలయ అర్చకుడు వినోద్ మహారాజ్ పండితుడిగా హాజరై.. పెళ్ళితంతును పూర్తి చేశాడు. 
 
అయితే వివాహం జరిగిన 16వ రోజున వున్నట్టుండి కొత్త పెళ్లి కూతురు అదృశ్యమైంది. కొత్త పెళ్లి కూతురు కనబడట్లేదని ఆ ఊరంతా తెలిసిపోయింది. అదే సమయంలో ఆ ఊరి ఆలయ అర్చకుడు కూడా మాయమయ్యాడు. ఇకపోతే.. కొత్త పెళ్లి కూతురు వెళ్తూ వెళ్తూ ఒకటిన్నర లక్ష రూపాయల విలువగల బంగారం, 30వేల రూపాయల నగదు తీసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. అర్చకుడితో కొత్త పెళ్లికూతురికి పెళ్లికి ముందు నుంచే తెలుసునని.. పెళ్లికి ముందే అతనితో చెట్టాపట్టాలేసుకుని ఆమె తిరిగేదని తెలిసింది. ఇక అర్చకుడికి ఇప్పటికే వివాహం జరిగిందని, ఇద్దరు సంతానం కూడా వున్నారని పోలీసులు తెలిపారు.

అన్నీ చూడండి

సినీ సెలెబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్ - డీప్‌ఫేక్‌పై మీరు చేసేంది ప్రచారమే.. న్యాయం కాదు...

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్

సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్

చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు

భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం

తర్వాతి కథనం
Show comments