శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (19:28 IST)

అలీ.. మీ మంచికే చెప్తున్నా.. మీరు ఎన్నికల్లో పోటీ చేయవద్దు..?

sivaji
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరైన నటుడు శివాజీ తాజాగా 90టీస్ వెబ్ సిరీస్ కోసం కెమెరా ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ విజయంతో శివాజీకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈటీవీలో ప్రసారమైన 'అలీతో సరదాగా' టాక్ షోకి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీ ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
 ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హాస్యనటుడు అలీని ఉద్దేశించి శివాజీ మాట్లాడుతూ... "మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా?" అని ప్రశ్నించారు. అలీ సూటిగా సమాధానం చెప్పకుండా.. అందరూ బాగానే ఉన్నారు.. ఇంకేం కొత్తదనం" అంటూ తనదైన శైలిలో నవ్వించారు.
 
దీనిపై శివాజీ స్పందిస్తూ.. మీరు ఎన్నికల్లో పోటీ చేయవద్దు అని సలహా ఇచ్చారు. నాకు రాజకీయ రంగంలో క్షేత్రస్థాయి అనుభవం ఉంది.. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నాకు ఈ అవగాహన వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చేవారు డబ్బు ఖర్చు చేయాలి. పెట్టుబడి పెట్టిన డబ్బును తిరిగి రాబట్టుకునే సత్తా ఉండాలి. 
 
మీరు ఎవరి దగ్గరా తీసుకోలేరు కాబట్టి దయచేసి ఎన్నికల్లో పోటీ చేయకండి. మీరు ఉన్న పార్టీ కోసం పని చేయండి, అంతే.. మీ మంచి కోసమే చెబుతున్నాను" అని శివాజీ సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీలో అలీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.