శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శుక్రవారం, 19 నవంబరు 2021 (16:42 IST)

అద్భుతమైన అందాలు.. శేషాచలం కొండలు

తిరుమల శ్రీవారు కొలువై ఉన్న శేషాచలం కొండలు అద్భుతంగా దర్సనమిస్తున్నాయి. గత రెండురోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా తిరుమల కొండలను దట్టంగా పొగమంచు కప్పబడి ఉంది. అంతేకాకుండా మాల్వాడి గుండం నుంచి వస్తున్న నీరు కపిలతీర్థంతో పాటు కొండల మధ్య నుంచి జాలువారుతున్నాయి.

 
తిరుపతిలో ఈ దృశ్యాలు అందంగా దర్సనమిస్తున్నాయి. తిరుమలలో పడుతున్న వర్షపు నీరు మొత్తం కొండల నుంచి జాలువారుతూ తిరుపతిలోని కపిలతీర్థం, మాల్వాడి గుండంల నుంచి వస్తోంది. వరద ఉదృతి ఏమాత్రం తగ్గలేదు. 

 
వర్షపునీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. తమ ఫోన్‌లో ఫోటోలను బంధిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం మొదటి ఘాట్ రోడ్డులో మాత్రమే భక్తులను అనుమతించడంతో భక్తులు అటువైపుగా వెళుతూ దగ్గర నుంచి సుందర దృశ్యాలను తిలకించారు.