శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (13:03 IST)

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ అమిత్ షానే....

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ అమిత్ షా నే ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన మార్గాన్ని ఏర్పరచుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలను బీజేపీ ఆయన సారథ్యంలోనే ఎదుర్కోనుంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ అమిత్ షా నే ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన మార్గాన్ని ఏర్పరచుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలను బీజేపీ ఆయన సారథ్యంలోనే ఎదుర్కోనుంది.
 
నిజానికి షా పదవీ కాలం 2019 జనవరిలోనే ముగియనుంది. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న విధంగా ఫలితాలు రానిపక్షంలో తనను మార్చాలన్న డిమాండ్‌ రాకుండా ఉండేందుకు అమిత్‌ షా ముందే జాగ్రత్తపడ్డారు. ఆయన ఏక పక్ష వైఖరిపై ఇప్పటికే పార్టీలోనూ, సంఘ్‌ పరివార్‌లోనూ విమర్శలు తలెత్తాయి కూడా. 
 
అమిత్ షా స్థానంలో మరొకర్ని నియమించే అవకాశాలున్నాయన్న ఊహాగానాలూ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన షా, ప్రధాని నరేంద్ర మోడీలు ఆర్ఎస్ఎస్‌ను ప్రసన్నం చేసుకొని షా పదవీకాలం పొడిగింపునకు అనుమతి పొందినట్లు సమాచారం.