శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (13:01 IST)

లిఫ్ట్‌లో నరకయాతన అనుభవించిన చిన్నారి.. 20 నిమిషాల తర్వాత?

Lift
Lift
లిఫ్టులే ప్రస్తుతం అపార్ట్‌మెంట్ వాసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. సరైన నిర్వహన లేకపోవడం వలన తరచూ మొరాయిస్తుంటాయి. మధ్యలో ఆగిపోవడం, డోర్ తెరుచుకోకపోవడం జరుగుతోంది. తాజాగా ఓ చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ చిన్నారి నరకం అనుభవించింది. 
 
దాదాపు 20 నిమిషాల పాటు తలుపులు తెరుచుకోకపోవడంతో బిడ్డ తల్లడిల్లిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కుర్సీ రోడ్‌లో జ్ఞానేశ్వర్ ఎన్‌క్లేవ్‌లో స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఓ చిన్నారి.. లిఫ్ట్ ఎక్కింది. తను వెళ్లాల్సిన ఫ్లోర్ నెంబర్ క్లిక్ చేసింది. 
 
సగం దూరం వెళ్లగానే లిప్ట్ మధ్యలోనే ఆగిపోయింది. లిఫ్ట్ డోర్ ఎంతకీ ఓపెన్ అవలేదు. దాంతో చిన్నారి బెదిరిపోయింది. భయాందోళనలకు గురైంది. 
 
కాపాడండి అంటూ అరిచింది. డోర్ ఓపెన్ చేసేందుకు ఎంతగానో ప్రయత్నించింది. 20 నిమిషాల పాటు ఆ చిన్నారి లిఫ్ట్‌లో నరకయాతన అనుభవించింది. ఆ తరువాత లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో చిన్నారి సురక్షితంగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.