ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (16:01 IST)

జుట్లు పట్టుకొని నడిరోడ్డుపై అమ్మాయిలు వీరంగం.. నెట్టింట వీడియో వైరల్ (video)

Students
Students
నడిరోడ్డుపై విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు. కొందరు కర్రలతో కొట్టుకున్నారు. అమ్మాయిలు జుట్లు పట్టుకొని మరీ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. అడ్డుకొనేందుకు వెళ్లినవారిసైతం పక్కకు తోసి మరీ తన్నుకున్నారు. 
 
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టత లేదు. కానీ స్ట్రీట్ ఫైట్‌లో పాల్గొన్న విద్యార్థినులు మాత్రం బెంగళూరులోని ఓ ప్రముఖ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు అని తెలుస్తోంది.
 
విద్యార్థులు తన్నుకుంటున్న సమయంలో వీడియో తీసిన ఓ వ్యక్తి దాని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముంది నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.