బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (13:26 IST)

కొత్త గవర్నర్ల నియామ‌కం... మిజోరం గ‌వ‌ర్న‌ర్‌గా హ‌రిబాబు

దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ నియామ‌కాల‌పై రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ భార‌తీయ జన‌తా పార్టీ సీనియర్‌ నేత కంభంపాటి హరిబాబుకు గవర్నర్‌ పదవి దక్కింది.

మిజోరం గవర్నర్‌గా ఆయనను నియమించారు. ఇక కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లోత్‌కు కూడా గవర్నర్‌ పదవి ఇవ్వడం గమనార్హం. ఆయన కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతో కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ అతి త్వ‌ర‌లోనే ఉంద‌ని తెలుస్తోంది. 
 
వివిధ రాష్ట్రాల గవర్నర్ల జాబితా ఇది....
మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు
హరియాణా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ
కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లోత్‌
మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూభాయ్‌ పటేల్‌
గోవా గవర్నర్‌గా పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై
త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌
ఝార్ఖండ్‌ గవర్నర్‌గా రమేశ్‌ బైస్‌
హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌