మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2024 (18:11 IST)

Google Maps: గూగుల్ మ్యాప్ ముంచేసింది.. దట్టమైన అడవుల్లోకి ఫ్యామిలీ.. రాత్రంతా?

Google Maps
Google Maps
Google Maps: గూగుల్ మ్యాప్స్ రాంగ్ రూటును కనెక్ట్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. బీహార్ నుంచి గోవాకు కారులో వెళ్తున్న ఓ కుటుంబానికి గూగుల్ మ్యాప్స్ తప్పు రూట్ చూపించడం వల్ల వల్ల రాత్రంతా ఇబ్బందులు పడ్డారు. ఆ క్రమంలో దట్టమైన అడవుల్లోకి వెళ్లి చిక్కుకున్నారు. రాత్రంతా ఆ దట్టమైన అడవుల్లో చిక్కుకుని.. మృగాల భయంతో కారు డోర్స్ లాక్ చేసి బిక్కు బిక్కు మంటూ గడిపారు. 
 
వివరాల్లోకి వెళితే..  కర్నాటకలోని బెలగావి జిల్లాకు చేరుకున్న తర్వాత, అప్లికేషన్ వారికి ఒక చిన్న మార్గాన్ని చూపించింది. అది ఖాన్‌పూర్‌లోని దట్టమైన భీమ్‌ఘర్ అడవి గుండా వెళుతుంది. 8 కిలోమీటర్లు లోపలికి వెళ్లాక వారికి అది పొరపాటు అని అర్థమైంది. ఆ క్రమంలో కారు దట్టమైన అడవికి చేరుకున్నాక ఫోన్ నెట్ వర్క్ కూడా తగ్గిపోయింది. దీంతో వారు చేసేదేమి లేక రాత్రంతా అడవిలో గడిపారు. 
 
తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబం నెట్‌వర్క్ కోసం నాలుగు కిలోమీటర్లు నడిచినట్లు పేర్కొన్నారు.ఆ క్రమంలో ఓ చోట నెట్ వర్క్ సౌకర్యం లభించగా వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112ను సంప్రదించారు. అప్పుడు పోలీసులు వచ్చి వారిని అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. 
 
ఈ అడవి ప్రమాదకరమైన వన్యప్రాణులను కలిగివుందని పోలీసులు తెలిపారు. గత నెలలో కూడా గూగుల్ మ్యాప్స్ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇక తాజా ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి.