శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (10:07 IST)

తనకంటే 20 ఏళ్ల చిన్నది నటి నిమ్రత్‌తో టీమిండియా కోచ్ ప్రేమాయణం...?

క్రికెట్, సినిమా ఈ రెండూ అంటే జనాలకు పిచ్చ క్రేజ్. అలాగే ఈ రెండు వృత్తుల్లో వున్న సెలబ్రిటీలు కూడా ఒకరంటే ఒకరు పిచ్చపిచ్చ క్రేజ్ కనబరుస్తుంటారు. అవకాశమొస్తే డేటింగుల తలుపులు బార్లా తెరిచేస్తారు. అలా ఇప్పటికే చాలామంది పెళ్లిళ్లతో ఫిక్సయ్యారు. ఇప్పుడు

క్రికెట్, సినిమా ఈ రెండూ అంటే జనాలకు పిచ్చ క్రేజ్. అలాగే ఈ రెండు వృత్తుల్లో వున్న సెలబ్రిటీలు కూడా ఒకరంటే ఒకరు పిచ్చపిచ్చ క్రేజ్ కనబరుస్తుంటారు. అవకాశమొస్తే డేటింగుల తలుపులు బార్లా తెరిచేస్తారు. అలా ఇప్పటికే చాలామంది పెళ్లిళ్లతో ఫిక్సయ్యారు. ఇప్పుడు తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రిపైన ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. అదేంటయా అంటే... రవిశాస్త్రి తన కంటే 20 ఏళ్ల చిన్నదైన బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో డేటింగ్ చేస్తున్నాడంటూ.
 
కానీ ఈ విషయంపైన వీళ్లిద్దరూ ఇప్పటివరకూ ఎక్కడా చెప్పలేదు. కానీ మీడియా వూరుకుంటుందా? పొగ వస్తే చాలు... నిప్పు ఎక్కడ వుందా అని వెతికిపట్టి లాగి మరీ చూపిస్తుంది. ఇప్పుడలానే వీరి ప్రేమాయణాన్ని కనిపెట్టేశారు. కాగా రవిశాస్త్రి తన భార్య రీతూకి పదేళ్లుగా దూరంగా వుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో 2015లో ఓ కంపెనీ కార్ల లాంచింగ్ సందర్భంగా నిమ్రత్‌ను చూసి రవిశాస్త్రి పడిపోయారట. ఇక అప్పటినుంచి వీళ్లమధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు సమాచారం. మరి దీన్ని వాళ్లిద్దరూ దీనిపై క్లారిటీ ఇస్తారో లేదంటే ఇలాగే గుసగుసలు సాగనిస్తారో వెయిట్ అండ్ సీ.