శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 నవంబరు 2021 (20:19 IST)

బ్రహ్మంగారి కాలజ్ఞానం: తోక బాలుడు పుట్టాడు

కలియుగం అంతం సమీపించేకొద్దీ వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటాయని ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. ఆచారాలకు విలువలేకుండా పోతుందనీ, ఎన్నో ఉపద్రవాలు చోటుచేసుకుంటాయని చెప్పారాయన.

 
బ్రహ్మంగారు చెప్పినట్లే ఇప్పటికే చాలా సంఘటనలు జరిగాయి. జరుగుతున్నాయి. కోరంకి జబ్బుతో కోటి మంది చనిపోతారని కాలజ్ఞానంలో వుంది. ఆయన చెప్పినట్లే కరోనా రావడం లక్షల్లో మరణాలు సంభవించడం జరుగుతోంది. ప్రస్తుతం మరో వింత చోటుచేసుకుంది.

 
బ్రెజిల్‌లో ఫోర్టలెజా పట్టణంలో ఆల్బెర్ట్ సాబిన్ అనే పిల్లల ఆసుపత్రిలో శిశువు తోకతో జన్మించాడు. ఈ మగ శిశువుకు తోక ఉండటాన్ని చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ తోక 12 సెంటీమీటర్ల పొడవు వుండటంతో పాటు తోక చివర్లో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతిలాంటి ఆకారం కూడా ఉంది. ఇలాంటి శిశువుని తాము ఇంతవరకూ చూడలేదని వైద్యులు తెలిపారు. కాగా శిశువు తోకను శస్త్రచికిత్స చేసి కత్తిరించినట్లు వైద్యులు తెలిపారు.