శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (17:44 IST)

రాపిడో బైక్ రైడర్ వేధింపులు.. దూకేసిన మహిళ.. నిందితుడి అరెస్ట్

Rapido Bike
Rapido bike
బెంగుళూరులో రాపిడో బైక్ రైడర్ చేసిన వేధింపుల ప్రయత్నం నుండి తప్పించుకోవడానికి కదులుతున్న బైక్ నుండి దూకింది. ఈ సంఘటన మొత్తం లోకల్ సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ చేయబడింది. మహిళ ఇందిరానగర్‌లోని తన స్నేహితుడి ఇంటికి చేరుకోవడానికి బైక్‌ను బుక్ చేసినప్పుడు ఈ సంఘటన జరిగింది. 
 
ఓటీపీ వస్తుందనే సాకుతో రైడర్ ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని డ్రైవింగ్ చేసిన రాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఇందిరానగర్‌కు బదులు దొడ్డబళ్లాపూర్‌ రోడ్డు వైపు రూట్‌ మార్చాడు. ఇదేంటని ప్రశ్నించగా వేగంగా వెళ్లాడు. 
 
అయితే యలహంక సమీపంలోని నాగేనహళ్లిలోని బీఎంఎస్ కళాశాల సమీపంలో బైకుపై వున్న వున్న మహిళ వాహనంపై నుంచి దూకేసింది. ఈ ఘటనతో ఆమె చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. కళాశాల గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెకు సహాయం చేయడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. 
 
దీనిపై ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనా సమయంలో మద్యం మత్తులో ఉన్న నిందితుడు దీపక్‌రావును అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.