సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (12:32 IST)

అచ్చం మోడీలాగే.. ప్రధాన ద్వారం మెట్లకు నమస్కరించి పార్లమెంట్‌లోకి..

గత సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా తొలిసారి ఎన్నికై సభలో అడుగుపెట్టే ముందు నాడు ప్రధానమంత్ర నరేంద్ర మోడీ పార్లమెంట్ ప్రధాన ద్వారం మెట్లకు నమస్కరించారు. పార్లమెంట్‌ను ప్రజాదేవాలయంగా భావించి

గత సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా తొలిసారి ఎన్నికై సభలో అడుగుపెట్టే ముందు నాడు ప్రధానమంత్ర నరేంద్ర మోడీ పార్లమెంట్ ప్రధాన ద్వారం మెట్లకు నమస్కరించారు. పార్లమెంట్‌ను ప్రజాదేవాలయంగా భావించి ఆయన అలా చేశారు. 
 
ఇపుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అచ్చం అలానే చేశారు. తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న మెట్లకు నమస్కరించి లోపలికి అడుగుపెట్టారు.
 
తొలుత చంద్రబాబు అన్నాడీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత వేణుగోపాల్‌తో మాట్లాడారు. మనమంతా దక్షిణ భారతీయులమని... ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. 
 
దీనిపై స్పందించిన వేణుగోపాల్ తమ పార్టీ అధిష్టానంతో భేటీ అయి నిర్ణయం తీసుకుంటామని...పార్టీ అధినేతతో చర్చించిన అనంతరం తమ నిర్ణయాన్ని తెలుపుతామని చంద్రబాబుకు తెలియజేశారు. అనంతరం పార్లమెంటు సెంట్రల్‌ హాల్ చేరుకున్న చంద్రబాబు కాంగ్రెస్, బీజేపీ మినహా వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లను కలుసుకున్నారు. 
 
చంద్రబాబు కలుసుకున్న వారిలో ఫరూక్‌ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా, జితేందర్‌ రెడ్డి, వీరప్పమొయిలీ, రాజీవ్‌ సాతీవ్‌‌తో పాటు టీఎంసీ ఎంపీ సౌగత్‌ రాయ్‌లు ఉన్నారు. అవిశ్వాసంపై మద్దుతు తెలిపిన కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీ ఫ్లోర్ లీడర్ల‌ను చంద్రబాబు కలుసుకుని ధన్యవాదాలు తెలుపున్నారు.