Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై: హాస్టల్ క్యాంటీన్.. చట్నీ పాత్ర నుంచి ఎగిరిపడిన ఎలుక

Updated: సోమవారం, 28 జనవరి 2019 (18:19 IST)
చెన్నైకి చెందిన ఓ కళాశాల క్యాంటీన్‌లో విద్యార్థులకు అందించే చట్నీ నుంచి ఎలుక పరుగులు తీసిన ఘటన సంచలనానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై సెమ్మంజేరిలోని ఓ ప్రైవేట్ కాలేజీ హాస్టల్‌లోని చట్నీ నుంచి ఓ ఎలుక ఎగిరి బయటికి రావడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. 
 
సెమ్మంజేరిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ఆహారాన్ని అందించే హాస్టల్ క్యాంటీన్‌లోని చట్నీ పాత్ర నుంచి ప్రాణాలతో వున్న ఎలుక ఎగరి గంతేయడం అందరికీ షాక్ ఇచ్చింది. 
 
చట్నీ పాత్ర నుంచి ఎలుక బయటికి రావడంతో విద్యార్థులు పరుగులు తీశారు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. తమకు అందించే ఆహారంలో నాణ్యత లోపించిందని.. శుభ్రత పూర్తిగా లేదని ఆందోళన చేపట్టారు.

అన్నీ చూడండి

Mohanlal: మోహన్‌లాల్ - విష్ణు మోహన్ మూవీ టైటిల్ ఆపరేషన్ గంగా

అనూప్ రూబెన్స్ ముగ్గురు కోతులు చిత్రం సాంగ్ రిలీజ్

Athreyapuram Brothers,: ఆత్రేయపురం బ్రదర్స్ చిత్రీకరణ పూర్తి

NBK111 టైటిల్ దాదా? విడుదల తేదీ అప్ డేట్ రాబోతోంది

విశ్వక్ సేన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా లెగసీ విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments