Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముకు పాలు కాదు.. నీళ్లు పోసిన అధికారి.. గుటకలేసుకుని తాగుతూ? (వీడియో)

Updated: సోమవారం, 24 జూన్ 2019 (10:43 IST)
పామును చూస్తే ఆమడ దూరం పారిపోతాం. అలాంటి పాముకు పాలు కాదు నీళ్లు పోశాడు.. ఓ వ్యక్తి. మండే ఎండల్లో దాహార్తితో నీటి కోసం ఎదురు చూస్తున్న ఓ సర్పరాజుకు అటవీ శాఖ అధికారి ఒకరు నీరందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. 
 
అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు. దాహంతో అరటితోటలోకి వచ్చిన పాముకు సదరు అటవీ శాఖాధికారి పాము తల నిమురుతూ బాటిల్‌తో అందిస్తున్న నీటిని అది గుటకలు వేస్తూ తాగుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో  జోరుగా చక్కర్లు కొడుతోంది.
 
అరటి తోటలో పడగవిప్పి నీటికోసం ఎదురుచూస్తున్న ఓ తాచుపాము.. అటవీ శాఖాధికారి కంట పడింది. వెంటనే ఆ అధికారి దాన్ని తరిమికొట్టకుండా.. వెంటనే తనవద్ద ఉన్న బాటిల్‌లో నీటిని దానికి పట్టించారు. అంతేకాదు చిన్నపిల్లాడిని సాకినట్టు పాము పడగపై చేయివేసి నిమురుతూ బాటిల్‌ను దాని నోటివద్ద పెడితే అది గుటకలు వేస్తూ నీటిని తాగేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments