Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాద్ నగర్‌లో డాక్టర్ ప్రియాంక దారుణ హత్య, అత్యాచారం చేసి చంపారా?

Written By ఐవీఆర్
Updated: గురువారం, 28 నవంబరు 2019 (18:01 IST)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో మహిళా డాక్టర్ ప్రియాంకా రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన దుండగులు గుర్తు తెలియకుండా పెట్రోలు పోసి తగులబెట్టారు. పూర్తిగా తగులబడిన స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. నిన్నరాత్రి 9.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం స్కూటీ పంక్చర్ అయింది. దాంతో ఆమె వెంటనే కుటుంబ సభ్యలకు సమాచారం అందించింది. 
 
తన స్కూటీ పాడైందనీ, అక్కడ లారీ డ్రైవర్లు వున్నారనీ, భయపడుతూ చెప్పింది. కొద్దిసేపటికే ఆమె ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించగా 28 తేదీ ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి మృతదేహం గుర్తుపట్టని విధంగా లభ్యమైంది. 
 
ఆమెని వేరే ప్రాంతంలో హత్య చేసి, ఇక్కడికి తీసుకొచ్చి తగలబెట్టినట్లు పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. ప్రియాంకా కాల్ లిస్టును పరిశీలిస్తున్నారు. లారీ డ్రైవర్లు ఘాతుకానికి పాల్పడి వుంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  సమీపంలోని సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా ప్రియాంకా రెడ్డి నవాబుపేట మండలం కొల్లూరు వెటర్నరీ డాక్టర్‌గా పని చేస్తున్నారు.
 

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments