బుడ్డోడికి బాతు చేసిన సహాయం చూసారా..? (వీడియో)

మంగళవారం, 27 ఆగస్టు 2019 (18:07 IST)
సాధారణంగా బాతులు మనుషులను చూస్తే ఆమడ దూరం వెళ్లిపోతాయి. అలికిడి అయితే ఒక్కసారిగా తుర్రుమంటాయి. కానీ ఓ బుజ్జి బాతు మాత్రం ఓ పిల్లవాడికి సహాయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఓ బాలుడి చెప్పు గుంతలో పడిపోయింది. దానిని తీసుకోవడానికి బాలుడు ప్రయత్నించినప్పటికీ, సాధ్యం కాలేదు. అయితే గుంతలో పడిపోయిన చెప్పును ఒక బాతు పట్టుకొచ్చి ఇచ్చింది. బుజ్జిబాతు ఆ చెప్పును నోటికి కరుచుకుని బాలుని అందించే ప్రయత్నం చేసింది, ఇలా రెండు మూడు సార్లు దగ్గరకు వచ్చినట్లే వచ్చి జారిపోయింది.
 
అయినా కూడా ఆ బుజ్జి బాతు ప్రయత్నిస్తూనే ఉంది, అయితే ఎలాగోలా కష్టపడి చెప్పును ముక్కున కరచుకుని తెచ్చి ఇచ్చింది. బాతు అందించిన చెప్పు పట్టుకుని బుడ్డోడు అక్కడి నుండి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత బాతు కూడా ఆ గుంతలో నుంచి బైటకు వచ్చి, తన రెక్కలతో టపటపా కొట్టి మరీ నేను సాధించానోచ్ అంటూ చెప్పింది.
 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్స్‌ బాతు చేసిన సహాయానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆ బాతు పిల్లాడి పెంపుడు బాతు అని కొందరు, కాదని మరికొందరు కామెంట్‌లు చేస్తున్నారు. అదేమైనా బాతును చూసిన వారికి ఒక్కటి మాత్రం అర్థమవుతుంది.

చేసే పని కష్టంగా ఉన్నప్పటికీ, వదలకుండా ప్రయత్నిస్తే..అది తప్పకుండా సాధ్యమవుతుందని బాతు చెప్పకనే చెప్పింది. ఈ వీడియోని మీరు కూడా చూడండి మరి..

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments