Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మొక్కజొన్న పొత్తుల్ని తొక్క తీసి మరీ తింటున్న ఏనుగు.. వీడియో వైరల్

Written By సెల్వి
Updated: శుక్రవారం, 23 జులై 2021 (15:42 IST)
Elephant
ఏనుగుకి చెరుకు గడలంటే ఎంతిష్టమో.. ఓ ఏనుగు ముందు మోపులు మోపులు చెరుగు గడలు పెడితే క్షణాల్లో లాగించేస్తుంది. అలాగే మొక్కజొన్నపొత్తులంటే కూడా చాలా ఇష్టం ఏనుగులకు. గడ్డి, ఆకులు, చెట్ల కొమ్మలతో పాటు రకాల మొక్కల్ని.. గెలల కొద్దీ అరటిపండ్లు లాగించేస్తాయి ఏనుగులు. 
 
కానీ ఏనుగు ఏది తిన్నా డైరెక్టుగానే తినేస్తుంది. అరటి పండ్లు తింటే తొక్క ఒలిచి తినదు కదా మనలాగా.. కానీ ఓ ఏనుగు మాత్రం అరటి పండ్లను కాదు గానీ..మొక్కజొన్న పొత్తుల్ని తినే విధానం మాత్రం భలే చూడముచ్చటగా ఉంది.
 
సాధారణంగా ఏనుగు చెరుకు గడలు తిన్నా..అరటి పండ్లు తిన్నా గానీ డైరెక్టుగానే తినేస్తుంది. తొక్కలతో సహా..కానీ మరి ఓ ఏనుగు మాత్రం మరి దానికి శుభ్రత ఎక్కువో లేదా.. కాస్త నీట్‌గా తినాలని అనికుందో గానీ మొక్కజొన్న కండెల్ని తొక్క తీసి తొక్కతో పాటు ముచ్చిక కూడా తీసి మరీ తింటోంది. అలా మొక్కజొన్న కండెని కాలితో తొక్కి పట్టి పైన ఉండే దాని తొక్కలు అంటే రేకులు రేకులుగా ఉండే వాటిని తీసి నీట్‌గా నోట్లో పెట్టుకుని గుటుక్కుమనిపిస్తోంది.
 
అలా తినేటప్పుడు ఓ కండెను తొక్క తీసి నోట్లో పెట్టుకుంటుండగా దానితో పాటు దాని ముచ్చిక కూడా ఉంది. కానీ నీట్ నెస్‌లో ఏమాత్రం కాంప్రమైజ్ కానీ ఈ ఏనుగు ఆ ముచ్చికను కూడా విరిగి పడేసి ఓన్లీ కండెను మాత్రం తింది. అలా ఈ ఏనుగు మొక్కజొన్న కండెల్ని తినే తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments