అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం తప్పదు
అన్నీ వడ్డించిన విస్తరి లేదా పళ్లెం ముందు కూర్చోరాదు. మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు. అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ.
తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా దీర్ఘాయుష్షు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము. సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది. ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది. దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది.
అన్నము తింటున్నప్పుడు అన్నమును, ఆ అన్నము పెట్టువారిని తిట్టట, దుర్భాషలాడుట చేయరాదు. ఏడుస్తూ తినరాదు. పళ్లెంలో అన్నాన్ని మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు.
ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచెం పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు. ఇది చాలా దరిద్రము, అట్టివారికి నరకము ప్రాప్తించును.
భోజన సమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం.
భోజనానంతరము ఎంగిలి ఆకులు, కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం, అన్నదాతకు సైతం కూడా రాదు.