ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (13:42 IST)

త‌మిళ‌నాడు టెంపుల్‌సిటీలో హైలైట్‌కానున్న‌`అఖండ‌` క్ల‌యిమాక్స్‌

Trimanvali temple shooting
‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల తర్వాత నటసింహా, హీరో నందమూరి బాలకృష్ణ, డాషింగ్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తాజాగా రూపొందుతున్న మూడో చిత్రం ‘అఖండ’. హీరో నంద‌మూరి బాలకృష్ణ, దర్శకులు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు సూపర్‌ హిట్‌గా నిలవడంతో వీరి కాంబినేషన్‌లోని లేటెస్ట్‌ మూవీ ‘అఖండ’ పై ఇటు ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘అఖండ’ సినిమా టీజర్‌కు వ్యూయర్స్‌ నుంచి వస్తున్న స్పందన ఈ అంచనాలను మరో స్థాయికి తీసుకుని వెళ్లింది.
 
ఈ సినిమా తాజా షెడ్యూల్‌ తమిళనాడులో ప్రారంభమైంది. తమిళనాడులోని టెంపుల్ సిటీ తిరువ‌న్‌మ‌లైలోని ఓ దేవాలయంలో ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్‌లో బాలకృష్ణ స‌హా ఈ సినిమాలోని ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ స్టంట్‌ శివ ఈ ఫైట్‌ సీన్‌ను డిజైన్‌ చేశారు. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఈ సినిమాలో మరో హైలైట్‌గా నిలవనుంది.
 
‘అఖండ’ సినిమాను ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ‘అఖండ’ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సి. రామ్‌ ప్రసాద్‌ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.