సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Updated : శనివారం, 10 జులై 2021 (19:53 IST)

తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌

తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఇటీవల మంత్రివర్గ విస్తరణ క్రమంలో పదవికి రాజీనామా చేశారు.

తాజాగా రవిశంకర్ ప్రసాద్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయ నిపుణుడిగా ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ బీజేపీలో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

దీనితో ఆయ‌న సేవ‌ల‌ను త‌మిళ‌నాట వినియోగించుకోవాల‌ని ప్ర‌ధాని మోదీ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.