1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (16:59 IST)

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ బ్లాక్

కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్‌కు వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ చట్టంపై ట్విట్టర్ యాజమాన్యానికి మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ అయింది. అమెరికాలోని మిలీనియం కాపీరైట్ చట్టాన్ని రవిశంకర్ ప్రసాద్ ఉల్లఘించారని ట్విట్టర్ సంస్థ కేంద్ర మంత్రి అకౌంట్ ను బ్లాక్ చేసింది. 
 
వీక్షకులను ఆయన ఖాతా కనిపించినప్పటికి పోస్ట్ పెట్టడానికి మాత్రం వీలుకాలేదు. విషయం తెలియడంతో ప్రభుత్వ వర్గాలు ట్విట్టర్‌కు హెచ్చరిక సందేశం పంపాయి. దీంతో వారు గంట అకౌంట్ పునరుద్ధరించారు. అయితే కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్ పోస్ట్ చెయ్యలేదని మంత్రి సిబ్బంది చెబుతున్నారు.
 
ఇక ఇదిలా ఉంటే ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం పీక్స్ చేరినట్లు తెలుస్తుంది. గతంలో ఉపరాష్ట్రపతి ట్విట్టర్ గ్రీన్ టిక్ తొలగించిన ట్విట్టర్, శుక్రవారం ఏకంగా ఐటీ మంత్రి ట్విట్టర్ ఖాతాని బ్లాక్ చేసింది. అయితే దీనిపై పలువురు నేతలు మండిపడుతున్నారు. ఇక ఈ విషయంపై రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ట్విట్టర్ తనకు ఎటువంటి నోటీసులు లెవ్వలేదని తెలిపారు.