శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (10:33 IST)

ఓటరు కార్డుకు - ఆధార్ నంబరుకు లింకుపెడతాం : కేంద్రం

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు కార్డును ఆధార్ నంబరుతో అనుసంధానం చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్ వేదికగా ప్రకటించింది. 
 
తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ.... ఓటర్ ఐడీకి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తామన్నారు. దీనివల్ల ఓటు హక్కు పరిరక్షణకు వీలవుతుందని అన్నారు. ఎవరు ఓటు వేశారో, ఎవరు వేయలేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.
 
ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం చేయాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. ఆధార్‌తో అనుసంధానిస్తే నకిలీ ఓట్లు తొలగిపోతాయని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడింది. ఓటర్ ఐడీని ఆధారుతో అనుసంధానం చేస్తే... నకిలీ ఓట్లను సులభంగా తొలగించవచ్చు. ఒక్కొక్కరు కేవలం ఒక ఓటుకు మాత్రమే పరిమితమవుతారు. రెండు, మూడు చోట్ల ఓటరుగా నమోదు చేసుకోవడం కుదరదు.