Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఏనుగుకు ఆకలి.. అంతే కిచెన్‌లోకి ఎంటరైంది.. చివరికి..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 22 జూన్ 2021 (16:53 IST)
ఆ ఏనుగుకు ఆకలి. అంతే కిచెన్‌లోకి ఎంటరైంది. ఈ ఘటన థాయిలాండ్‌లో చోటుచేసుకుంది. ఆకలితో ఉన్న ఓ ఏనుగు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఒకరి ఇంటి కిచెన్ లోకి ఎంటరైంది. గోడను తన తొండంతో ఎలా నాశనం చేసిందో గానీ.. ఎంచక్కా తన తల అందులో దూరేలా రంధ్రం చేసేసింది. అందులోనుంచి తలను జొప్పించి కింద ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉన్న బియ్యాన్ని లాగించేసింది. 
 
ఇంట్లో ఎదో అలికిడి అవుతున్నట్టు గమనించిన ఆ ఇంటి దంపతులు నిద్ర లేచి చూసేసరికి ఈ నిర్వాకం కనిపించింది. ఫుడ్ ని లాగించేస్తున్న గజరాజును చూసి షాక్ తిన్న వారు.. ఎలాగోలా అతి కష్టం మీద దాన్ని బయటకు వెళ్లగొట్టగలిగారు. అదృష్ట వశాత్తూ అది వారిపై దాడి చేయకుండా దగ్గరలోని చెట్లు, గుట్టల వద్దకు వెళ్ళిపోయింది. 
 
తమ ఇంటి కిచెన్ గోడ దాదాపు పూర్తిగా పడిపోయిందని, ఇప్పుడు మళ్ళీ గోడ కట్టాలంటే ఎక్కువే ఖర్చవుతుందని వాళ్ళు బావురుమంటున్నారు. కష్టపడి గోడ కట్టిస్తే మళ్ళీ రాదన్న నమ్మకమేమిటని వాపోతున్నారు. 

అన్నీ చూడండి

Sundeep Kishan: సందీప్ కిషన్ చిత్రం సిగ్మా రిలీజ్ కు రెండు అగ్ర సంస్థలు అండగా నిలిచాయ్

ఫ్యామిలీ నడపలేకపోతున్నా, బ్యాంక్ ఎకౌంట్స్ అన్‌ఫ్రీజ్ చేయించండి ప్లీజ్: ఐబొమ్మ రవి రిక్వెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో సైకలాజికల్ థ్రిల్లర్ హతహ: టీజర్ ఫిక్స్:

హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై కేసు

నేను త్రిష స్థానంలో ఉంటే విజయ్‌కు దూరంగా ఉండేదాన్ని : నటి అంబిక

తర్వాతి కథనం
Show comments