ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (17:32 IST)

స‌ర్వ‌ర్‌గా చేసిన రోజుల్ని గుర్తు చేసుకున్న మురుగ‌దాస్‌

Murugadoss
క‌రోనా కార‌ణంగా చాలామందికి త‌మ‌లోని టాలెంట్‌ను మెరుగుప‌రుచుకుంటున్నారు. మ‌రికొంద‌రు గ‌త జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకుంటూ థ్రిల్ ఫీల‌వుతున్నారు. అలా పూరీ జ‌గ‌న్నాథ్ మ్యూజింగ్స్ అంటూ త‌న‌లోని నాలెడ్జ్‌ను ఆలోచ‌న‌ల‌ను బ‌య‌ట‌కు చెబుతున్నాడు. అలాంటిదే త‌మిళ‌ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌. మురుగ‌దాస్ కూడా గ‌త జ్ఞాప‌కాల‌ను స్టోర్‌రూమ్ మెమొర‌సీ పేరుతో నెమ‌రేసుకుంటూ  అభిమానుల కోసం షేర్ చేశాడు.
 
ఎ.ఆర్‌. మురుగ‌దాస్ సినిమా రంగంలోకి ప్ర‌వేశించాల‌నే బ‌ల‌మైన కోరిక‌తోనే వుండేవారు. శివాజీగ‌ణేష‌న్‌కు అభిమాని ఆయ‌న. సినిమారంగంలోకి ప్ర‌వేశించాల‌ని ర‌చ‌యిత‌గా మారాడు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో స‌హాయ ద‌ర్శ‌కుడిగా చేశాడు. అయితే హీరో అవ్వాల‌ను ఆయ‌న‌కు వుందే ఏమోకానీ ఓ సినిమాలో న‌టుడిగా అవ‌తార‌మెత్తాడు. అది కూడా హోట‌ల్‌లో స‌ర్వ‌ర్‌గా. బ్లాక్ ఫ్యాంట్‌, టైక‌ట్టుకున్న వైట్ ష‌ర్ట్‌తో పెద్ద హోట‌ల్‌లో స‌ర్వ‌ర్‌గా చేయాల్సివ‌చ్చింది.

అబ్బాస్, సిమ్రాన్‌, న‌గేష్ న‌టించిన `పూజితం` సినిమాలో ఆయ‌న స‌ర్వ‌ర్ వేషం వేశాడు. అక్క‌డ న‌గేష్‌, సిమ్రాన్ రూమ్‌లో వుంటారు. రూమ్‌కు వ‌చ్చి టీ స‌ర్వ్ చేస్తాడు. నీపేరుమిట‌ని? న‌గేష్ అడిగితే, మురుగ‌దాస్ అని చెబుతాడు. యంగ్ ఏజ్‌లో వున్న ఆయ‌న లుక్‌ను ఇంటిలో ఆ క్లిప్‌ను త‌తేద‌కంగా చూసుకుంటూ మురిసిపోయాడు. స్టోర్‌రూమ్ మెమొర‌సీ అంటూ ఆయ‌న ఈ క్లిప్‌ను పెట్టాడు. దీనికి అనూహ్య రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మురుగ‌దాస్ అగ్ర‌హీరోల‌తో సినిమా చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు చేస్తున్నాడు. అందులో అల్లు అర్జున్ పేరు కూడా వుంది.