సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (11:46 IST)

పుచ్చకాయ అనుకుందో ఏమో.. ఆ ఏనుగు హెల్మెట్‌ను మింగేసింది..!

Elephant
పుచ్చకాయ, కర్భూజ లాంటి పండ్లను ఏనుగు గటక్కున మింగేస్తోంది. నోట్లో పెడితే చాలు సెకన్ల వ్యవధిలో నమిలేస్తోంది. తాజాగా రోడ్డుపై వెళ్తున్న ఏనుగుకు ద్విచక్రవాహనంపై హెల్మెట్ కనిపించింది. అది గుండ్రంగా ఉండడంతో హెల్మెట్‌ను తొండంతో తీసుకొని కడుపులో వేసుకుంది. 
 
అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు గుండా వెళ్తూన్న ఆ ఏనుగుకు హెల్మెట్‌ను చూడగానే నేరేడు పండులా నిగనిగలాడుతూ కనిపించిందేమో కానీ, దాన్ని చూడగానే లటుక్కున నోట్లో వేసేసుకుంది. 
 
దీన్ని చూసిన టూవీలర్‌ అతను నా హెల్మెట్‌ బాబోయ్‌ అంటూ తెగ బాధపడిపోయాడు. అయితే, జంతు ప్రేమికులు మాత్రం ఏనుగు గురించి ఆలోచిస్తున్నారు. ఆ హెల్మెట్‌ గొంతులోనే ఇరుక్కుంటే ఆ ఏనుగు ప్రాణాలకు ముప్పు వాటల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. 
 
ఈ ఘటన అసోంలో చోటు చేసుకుంది. గౌహతిలోని సత్‌గావ్‌ ఆర్మీ క్యాంప్‌లోక ఓ ఏనుగు ప్రవేశించింది. లోనికి వెళ్తూనే అది క్యాంప్‌లో పక్కన పార్క్‌ చేసి ఉన్న బైక్‌ మీద ఉన్న హెల్మెట్‌ను చూసింది. తొండంతో తీసుకుని నోట్లో వేసుకుని వెళ్లిపోయింది.