శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (13:06 IST)

కోవిడ్: ఇంగ్లాండులో జీరో మరణాలు, ప్రారంభమైన ఆత్మీయ ఆలింగనాలు

గత ఏడాది జూలై తర్వాత 24 గంటల వ్యవధిలో ఇంగ్లాండ్ లో కోవిడ్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. సోమవారం COVID-19 మరణాలను నివేదించింది అక్కడి ప్రభుత్వం.
 
యుకె హెల్త్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మే 10న యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2,357 కొత్త కేసులు, 4 మరణాలు సంభవించాయి. కానీ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌తో పాటు సున్నా మరణాలను నివేదించింది. ఏదేమైనా, వేల్స్ నాలుగు కరోనావైరస్ సంబంధిత మరణాలను నివేదించింది.
 
యూకె చీఫ్ మెడికల్ ఆఫీసర్లు హెచ్చరికలు, ప్రజలు నిబంధనలు పాటించడం, టీకాల కార్యక్రమం వేగంగా జరుగుతుండటంతో అక్కడ జీరో మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ''కోవిడ్ నిరోధానికి ప్రజల కృషికి, వైద్యుల వ్యాక్సిన్ కార్యక్రమానికి ధన్యవాదాలు, కేసులు మరియు మరణాలు యూకె అంతటా పడిపోయాయి" అని ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, హెల్త్ అండ్ సోషల్ కేర్ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి అన్నారు.
 
యుకె చీఫ్ మెడికల్ ఆఫీసర్స్ (సిఎంఓ) సంయుక్త ప్రకటన ప్రకారం, ''సామాజిక దూరం పాటించడంలో యుకె ప్రజల కృషి భేష్. అలాగే టీకా కార్యక్రమానికి కూడా పెద్దఎత్తున అందరూ తరలిరావడంతో కరోనా కేసుల సంఖ్యలు, మరణాలు, కోవిడ్ ఆసుపత్రి ఒత్తిళ్లు స్థిరంగా పడిపోయాయి.
 
ఐతే COVID ఇప్పటికీ ప్రతిరోజూ ఎక్కడోదగ్గర వ్యాప్తి చెందుతూనే ఉంది, కాబట్టి మనమందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మహమ్మారిగా మిగిలిపోయింది" అని ఆ ప్రకటన తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ డాష్‌బోర్డ్ ప్రకారం, యూకెలో ఇప్పటివరకు COVID-19 4,450,578 కేసులనూ, 127,865 మరణాలను నివేదించింది.