Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వార్నర్ అన్నా ఏందిది..? ఎందుకు నువ్వు వచ్చావ్ ? ఈషా రెబ్బా

Written By సెల్వి
Updated: సోమవారం, 26 ఏప్రియల్ 2021 (20:17 IST)
ఐపీఎల్ 2021 సీజ‌న్‌లో 14లో ఆదివారం రాత్రి చెన్నై వేదిక‌గా జ‌రిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో షేన్ వార్నర్ తప్పిదం కారణంగానే సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలిచిందంటూ ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 
 
తాజాగా ఆ లిస్ట్ లో తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ కూడా చేరారు. " వార్నర్ అన్నా ఏందిది..? ఎందుకు నువ్వు వచ్చావ్ ? బెయిర్ స్టోని లేదా సుచిత్ ను పంపొచ్చుగా..నీకు టీమ్ నిర్మించుకోవాలనుకుంటే డ్రీమ్ లెవెన్ లో ఆ పని చెయ్యి " అంటూ ట్వీట్ చేసింది ఈషా. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత హైదరాబాద్‌, ఢిల్లీ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా 159 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయ్యింది. దీంతో ఈ సీజ‌న్‌లో తొలిసారి ఈ సీజ‌న్‌లో సూప‌ర్ ఓవ‌ర్ అవ‌రమొచ్చింది.
 
ఈ సూప‌ర్ ఓవర్లో హైదరాబాద్‌పై ఢిల్లీ ఉత్కంఠ విజయం సాధించింది. సూపర్ ఓవర్‌‌లో కేన్ విలియమ్సన్‌తో కలిసి బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ డేవిడ్ వార్నర్.. మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేశాడు. 
 
చివరి బంతికి వార్నర్ డబుల్ తీసినా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు లోపల వార్నర్ బ్యాట్ ఉంచలేదని చెప్పిన అంపైర్ షార్ట్ రన్ తప్పిదం కింద ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దాంతో ఢిల్లీ టార్గెట్ 9 పరుగుల నుంచి 8 పరుగులకి తగ్గింది. 
 
జానీ బెయిర్‌స్టో లాంటి పవర్ హిట్టర్ ఉండగా.. కేన్ విలియమ్సన్‌తో కలిసి డేవిడ్ వార్నర్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వెళ్లడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

అన్నీ చూడండి

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

చిన్నప్పటి నుంచి ఆ హీరో అంటే నాకు క్రష్ : నటి ఆనంది

Mayooka Review :శ్రీ తేజ్ ఎస్ కే. తన మయూఖ చిత్రంతో ఆకట్టుకున్నాడా!.మయూఖ రివ్యూ

తర్వాతి కథనం
Show comments