Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తరుముకొస్తున్న "ఎక్స్ఈ'' ముప్పు... మాస్కులు తీయొద్దంటూ హెచ్చరిక

Written By ఠాగూర్
Updated: సోమవారం, 4 ఏప్రియల్ 2022 (09:06 IST)
కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పడుతుందని సంబరపడుతున్న వేళ మరో ముప్పు పొంచివుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్‌లోని మరో వేరియంట్ అయిన "ఎక్స్ఈ" నుంచి ముప్పు పొంచివుందని, ఇంది ప్రజలను మరింత భయపెడుతుందని అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఈ "ఎక్స్ఈ" వైరస్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్. "బీఏ.1, బీఏ.2"ల మిశ్రమ వేరియంట్‌గా వెల్లడించారు. ఇది బీఏ.2 కంటే 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో మాస్కుల వినియోగంపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తున్నారు. 
 
మాస్కులు తీసే సమయం ముందు ఉందని, ఇప్పటికైతే వాటిని ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేసమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా "ఎక్స్ఈ" వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా పురుడు పోసుకున్న చైనాలో రోజువారీగా నమోదయ్యే కేసులు సరికొత్త రికార్డును నెలకొల్పుతున్నాయి. అందువల్ల భారత్‌లోనూ మళ్లీ అది విజృంభించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని, అందువల్ల కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించనంతవరకు కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు ఆయా ప్రభుత్వాలకు సలహా ఇస్తున్నారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments