1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (11:28 IST)

ఏపీలోని సినిమా థియేటర్లలో కోవిడ్ ఆంక్షలు కఠినతరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగపోయింది. గత రెండు రోజుల క్రితం వరకు రెండు వేలకు దిగువున నమోదవుతూ వచ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం ఒక్కసారిగా ఆరు వేలను దాటిపోయాయి. దీంతో మంగళవారం రాత్రి నుంచి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
 
అదేసమయంలో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లోభాగంగా, ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలను అమలు చేస్తుంది. ముఖ్యంగా, సినిమా థియేటర్లలో కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేశారు. కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీ మేరకు సినిమా ప్రదర్శనలు జరిపేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఆంక్షలు ఉల్లంఘించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 
 
ఏమాత్రం చిన్నపాటి ఆంక్షలను సైతం ఉల్లంఘించినట్టు తేలితే తక్షణం నోటీసులు జారీచేస్తున్నారు. దీంతో థియేటర్ యజమానాలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే సినిమా టిక్కెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. దీంతో థియేటర్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఇపుడు కోవిడ్ ఆంక్షల పేరుతో అధికారులు పెడుతున్న ఇబ్బందులతో వారు విసిగిపోతున్నారు.