Dharma Sangrah
✕

ఆ మహిళ తలను నేలకు తాకేలా అమర్చి కత్తితో ఒక్క వేటుతో నరికేసిన తలారి...

అరబ్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాలో ఓ మహిళా హక్కుల కార్యకర్తకు బహిరంగంగా మరణ దండన అమలు చేశారు. ఈ శిక్షలో భాగంగా ఆమెకు శిరచ్ఛేదనం చేశారు. మహిళా కోర్టు న్యాయమూర్తి మరణ దండన విధించడంతో ఆ మహిళా కార్యకర్తక

Written By pnr
Updated: మంగళవారం, 21 ఆగస్టు 2018 (13:10 IST)
అరబ్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాలో ఓ మహిళా హక్కుల కార్యకర్తకు బహిరంగంగా మరణ దండన అమలు చేశారు. ఈ శిక్షలో భాగంగా ఆమెకు  శిరచ్ఛేదనం చేశారు. మహిళా కోర్టు న్యాయమూర్తి మరణ దండన విధించడంతో ఆ మహిళా కార్యకర్తకు ఈ తరహా శిక్షను అమలు చేశారు. ఈ దారుణ శిక్షా వివరాలను పరిశీలిస్తే..
 
సౌదీలో మహిళా హక్కుల పోరాటం చేసే కార్యకర్తల్లో ఒకరు ఎస్రా అల్ ఘంఘం. ఈమెను గత 2015 డిసెంబరు 8వ తేదీన ఆ దేశ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో ఆమె భర్త కూడా పక్కనే ఉన్నారు. 
 
షియాల ప్రాబల్యం ఉన్న ఖతీఫ్ ప్రాంతంలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా, రాజకీయ నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలని శాంతియుతంగా నిరసనగా ప్రదర్శనలను ఎస్రా అల్-ఘంఘం నిర్వహించేది. ఈ చర్యలను అరేబియా సర్కారు తోసిపుచ్చుతూ ఆమెపై రాజద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందన్న అభియోగం మోపారు. 
 
అలా గత మూడేళ్ళుగా జైల్లో ఉంటూ వచ్చిన ఘంఘం కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించనందువల్ల తన తరపున వాదించేందుకు లాయర్‌ని నియమించుకోలేక పోయింది. దీంతో ప్రభుత్వం ఏకపక్షంగా ఆమెకు బహిరంగ శిరచ్ఛేద మరణశిక్ష విధించింది. 
 
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో తలారి ఆమె తలను నేలకు తాకేలా సరిగ్గా అమర్చి కత్తితో ఒక వేటుకి నరికేశాడు. నాలుగు రోడ్ల కూడలిలో భద్రతా బలగాల సమక్షంలో ప్రజలంతా చూస్తుండగా ఈ శిక్షను అమలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
కాగా, సౌదీ అరేబియాకు కొత్త రాజుగా ఎన్నికైన మొహమ్మద్ బిన్ సల్మాన్ సామాజిక సంస్కరణలు చేపడుతూ దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి కృషి చేస్తున్నట్టు ప్రచారం చేసుకొంటున్న సమయంలో ఘంఘం శిరచ్ఛేదం జరగడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

డెహ్రాడూన్ ఐఎస్‌బిటి ఘటన స్ఫూర్తితో అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్ చిత్రం ఫస్ట్ లుక్

Bellamkonda Sai: వరుస నేరాలు వెనుక భారీ కుట్ర ఛేధించే అధికారిగా టైసన్ నాయుడు

Sharwa: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కథ గా శర్వా భోగి విడుదల తేదీ మార్పు

సమంతకు మగబిడ్డ పుట్టడం, పేరు పెట్టడం అన్నీ జరిగిపోయాయ్

Naga Chaitanya: వృషకర్మ లో చిన్నారికి కళ్లుగా మారిన ట్రెజర్ హంటర్ అర్జున్ ఏం చేశాడు?

తర్వాతి కథనం
Show comments