బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (11:14 IST)

ఫిఫా వరల్డ్ కప్ 2018 : నాకౌట్‌కు ఉరుగ్వే.. 25న రష్యాతో ఢీ

ఫిఫా వరల్డ్ కప్ 2018 సాకర్ పోటీల్లో ఉరుగ్వే నాకౌట్‌లోకి ప్రవేశించింది. బుధవారం సౌదీ అరేబియాతో జరిగిన గ్రూపు-ఎ లీగ్ మ్యాచ్‌లో ఉరుగ్వే 1-0 తేడాతో విజయం సాధించింది. తన అంతర్జాతీయ కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడ

ఫిఫా వరల్డ్ కప్ 2018 సాకర్ పోటీల్లో ఉరుగ్వే నాకౌట్‌లోకి ప్రవేశించింది. బుధవారం సౌదీ అరేబియాతో జరిగిన గ్రూపు-ఎ లీగ్ మ్యాచ్‌లో ఉరుగ్వే 1-0 తేడాతో విజయం సాధించింది. తన అంతర్జాతీయ కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడిన స్టార్ స్ట్రైకర్ లూయిస్ సూరెజ్(23ని) సూపర్ గోల్‌తో అదరగొట్టాడు. దీంతో ఈనెల 25వ తేదీన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యాతో ఉరుగ్వే తలపడుతుంది.
 
ఇప్పటికే గ్రూపు-ఎ నుంచి రష్యా, ఉరుగ్వే నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించగా, వరుసగా రెండు ఓటములు చవిచూసిన సౌదీ అరేబియా, ఈజిప్టు మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గత రెండు పర్యాయాలు ప్రపంచకప్‌లో విఫలమైన సూరెజ్.. తనదైన శైలిలో జట్టుకు విజయాన్నందించాడు. 
 
2010లో ఘనాతో మ్యాచ్‌లో బంతిని చెత్తో అడ్డుకుని, 2014లో ఇటలీ ఆటగాడు గిర్గియో చెల్లినీని కొరికి సూరెజ్ నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈజిప్టుతో తొలి మ్యాచ్‌లో అంతగా ప్రభావం చూపలేకపోయిన ఈ 31 ఏండ్ల ఉరుగ్వే స్ట్రైకర్.. సౌదీతో మ్యాచ్‌లో తన ప్రతాపం చూపించాడు.