Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై కనిపించిన దెయ్యం.. (ఫోటో వైరల్)

Written By సెల్వి
Updated: బుధవారం, 21 ఏప్రియల్ 2021 (09:31 IST)
Ghost
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా మనిషిలా కనిపించిన ఓ దెయ్యంకు సంబంధించిన ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. యూరప్‌లో క్రొయేషియా అనే దేశం వుంది. ఆ దేశంలోనే ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అక్కడి రాజధాని జాగ్రెబ్ నగరంలో ఓ బస్టాప్ ఉంది.
 
అక్కడ చాలామంది ప్రయాణీకులు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ నగరం పర్యాటక నగరం కావడంతో అక్కడ పర్యాటకులకు సైట్ సీయింగ్ కోసం గైడ్లు వుంటారు. అలాంటి ఓ టూర్ గైడ్.. బస్టాప్ దగ్గర ఓ ఫోటో తీశాడు. అందులో ఓ మహిళ మాత్రం అతనికి షాక్ ఇచ్చింది. 
 
ఆ ఫోటోలో ఆమె కాళ్ళలోంచి రోడ్డు కనిపిస్తోంది. రోడ్డుపై వున్న తెల్లటి గీత.. ఆమె కాళ్ళల్లోంచి కనిపిస్తోంది. ఫోటో తీసినప్పుడు దాన్ని అతను గమనించలేదు. తీరా గమనిస్తే ఆమె కాళ్ళ నుంచి రోడ్డుపై నుంచి గీతలు కనిపిస్తున్నాయి. 
 
ఈ ఘటన అతనిని ఆశ్చర్య పరిచింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాక.. చాలామంది ఆశ్చర్యపోయారు. చాలామంది షాకయ్యారు. కొంత మంది మాత్రం ఇందులో షాకింగ్ లేదని.. కెమెరా ట్రిక్స్ అంటున్నారు.

అన్నీ చూడండి

హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ హతః టైటిల్ ప్రకటన

NBK111 ఫ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని టైటిల్ & రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

Kaala Bhairava: కావ్య కళ్యాణ్‌రామ్, కాల భైరవ ఇస్టపడ్డారు త్వరలో పెండ్లి

అన్ని అంశాలతో మ్యూజికల్ డ్రామా గా జగమే సంగీతం : పల్నాటి సూర్య ప్రతాప్

Nagababu: నాగబాబు, కేఎస్ రవి కుమార్ అతిథులుగా వేట చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments