గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: శనివారం, 12 జూన్ 2021 (11:35 IST)

వాహనదారులకు శుభవార్త: ఇంటి నుంచే డ్రైవింగ్ లెర్నర్ లైసెన్స్

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన రూల్స్‌ సవరించింది. కొత్త రూల్స్ వల్ల చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది. మరీముఖ్యంగా లెర్నర్స్ లైసెన్స్ పొందటానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే లెర్నింగ్ లైసెన్స్ పొందొచ్చు. ఈ కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి.
 
కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత వాహనదారులు లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే లెర్నింగ్ లైసెన్స్ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌కు అనుగుణంగా సారథి సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్పులు చేస్తోంది.
 
మీరు ఆన్‌లైన్‌లో లెర్నింగ్ లైసెన్స్ పొందటానికి రాష్ట్ర ప్రభుత్వపు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. లేదంటే పరివాహన్ లేదా సారథి వెబ్‌సైట్లలోకి వెళ్లాలి. అక్కడి నుంచి లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఆన్‌లైన్ టెస్ట్ కూడా మీరు మీ ఇంట్లో నుంచే పూర్తి చేయొచ్చు. ఆర్‌టీవో ఆఫీస్‌కు వెళ్లక్కర్లేదు. టెస్ట్‌లో పాస్ అయిన వారు లెర్నింగ్ లైసెన్స్ పొందొచ్చు. తొలిగా ఈ సేవలు ఉత్తరప్రదేశ్‌లో అందుబాటులోకి రానున్నాయి. తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది.