బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (22:22 IST)

2008 డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌

అమరావతి: 2008 డీఎస్సీ అభ్యర్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.  2,193 మంది అభ్యర్ధులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌తో ఎస్జీటీలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మీడియా సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2008 డీఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్ న్యాయం చేశారన్నారు. మానవతా దృక్పథంతో డీఎస్సీ అభ్యర్ధుల సమస్యను పరిష్కరించామని మంత్రి ఆదిమూలపు తెలిపారు. 2018 డీఎస్సీ అభ్యర్ధులకు కూడా న్యాయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 486 పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్‌ పీఈటీలకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపారు.

అంతేకాకుండా మీడియా సమావేశంలో టెట్‌-2021 సిలబస్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. గతంలో బీఈడీ అభ్యర్ధులు చాలా అవకాశాలు కోల్పోయారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గత ప్రభుత్వం  2008 డీఎస్సీ అభ్యర్ధులను అసలు పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను కూడా చంద్రబాబు మోసం చేశారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు.