ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మే 2021 (09:46 IST)

నేడు మాతృభాషా దినోత్సవం.. : కూతురు మాంగల్యాన్ని నిలబెట్టిన అమ్మ

అమ్మ ఓ సహజ రోబో. తెల్లవారక ముందే పనులతో మొదలైన కుస్తీ రాత్రి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. వంటపని, ఇంటిపని, పిల్లల సంరక్షణ, భర్త బాగోగులు... ఇవన్నీ సమర్థించుకోవాలి. అలా గడియారంతో పోటీ పడుతూ ఉండే అమ్మను ఎప్పుడూ ప్రత్యేకంగానే చూసుకోవాలి. ఈరోజు ఆమెను మరింత ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే... అంతర్జాతీయ మాతృదినోత్సవం ఇవాళే! 
 
అంతేనా. అమ్మ పదానికి మించి గొప్పది ఏదీ లేదు. అదో అనిర్వచనీయమైన ప్రేమ. నవ మాసాలు మోసినా అలసట చెందని శ్రమజీవి.. పిల్లల ప్రపంచమే తన లోకంగా బతికే త్యాగశీలి.. బిడ్డలు ఏం చేసినా భరించే సహనశీలి.. అమ్మ మాత్రమే.. అలాంటి ఓ తల్లి తన కూతురు మాంగళ్యాన్ని కాపాడుకునేందుకు ఓ అమ్మ మహా త్యాగం చేసింది. 
 
ఆ వివరాలను పరిశీలిస్తే, ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం చాందా(టి) గ్రామానికి చెందిన సుజాతకు కన్నాల వెంకట్‌తో 2001లో వివాహామైంది. ఆ తర్వాత ఏడాదికి కుమారుడు జన్మించగా 2012లో వెంకట్​కు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. చెడిపోయిన మూత్రపిండాలు అంతా సాఫిగా సాగుతుందనుకుంటున్న తరుణంలో 2013లో వెంకట్‌ తీవ్ర అనారోగ్యానికి గురికాగా రెండు మూత్రపిండాలు చెడిపోయినట్లు తేలింది. 
 
అంతే సుజాత జీవితంలో అందకారం అలుముకుంది. వెంకట్​ తల్లితండ్రులతోపాటు భార్య సుజాత కిడ్నీలు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికీ మ్యాచ్‌ అవలేదు. ఇక బతకడం కష్టమనే భావన వైద్యుల నుంచి వినిపించింది. కూతురు మాంగళ్యానికి కష్టం వచ్చిందనే విషయం ఆమె తల్లి లక్ష్మికి తెలిసింది. అంతే వెనకాముందు ఆలోచించకుండా మూత్రపిండాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. 
 
అల్లుడుకి తన మూత్రపిండాలు సరిపోయాయి. అంతే, అనుకున్నట్లుగానే 2014 ఫిబ్రవరి ఏడో తేదీన వెంకట్‌కు మూత్రపిండం మార్పిడి శస్త్రచికిత్స చేశారు. తనకు ప్రాణపోసిన అత్తమ్మ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేదని వెంకట్​ అన్నారు. మరోపక్క లక్ష్మిలో మాత్రం తాను ప్రాణం నిలబెట్టాననే భావన ఏకోశానా కనిపించడం లేదు. 
 
తన కూతురు మాంగళ్యజీవితానికి తాను కాస్తంత ఆసరాగా నిలిచాననే ఆనందమే తొణికిసలాడుతోంది ఆ త్యాగశీలిలో. పైగా తాను చేసింది అసలు సాయమే కాదని మాతృత్వపు మమకారమని వినమ్రతగా చెబుతోంది.