హోమంత్రి అమిత్ షాకు అస్వస్థత... మెడ భాగంలో చిన్నపాటి సర్జరీ
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేరారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న కేడీ ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్పించారు.
వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటీవల షా సొంత రాష్ట్రం గుజరాత్‌కు ఆయన వెళ్లారు. ఆయన మంగళవారం సాయంత్రం కుటుంబం సభ్యులను కలుసుకున్నారు. ఈరోజు తిరిగి ఢిల్లీకి ప్రయాణించాల్సి ఉండగా ఆయన ఆరోగ్యం క్షీణించింది.
అయితే అమిత్ షా ఏ ఆరోగ్య కారణంతో ఆసుపత్రిలో చేరారన్నవిషయమై ఇటు కుటుంబ సభ్యులు, అటు ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. అయితే మెడ వెనుక భాగంలో ఓ చిన్న సర్జరీ కోసం షా కేడీ ఆసుపత్రిలో చేరినట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈరోజు సాయంత్రం షా డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని పేర్కొన్నాయి.