Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో మద్యం తయారు చేసుకోవడం ఎలా? గూగుల్‌లో శోధిస్తున్న నెటిజన్లు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 15 ఏప్రియల్ 2020 (17:34 IST)
లాక్‌డౌన్ కారణంగా మద్యంతో పాటు అన్నీ బంద్ అయ్యాయి. కేవలం అత్యవసర సేవలు మినహా ఇతరాలేమీ అందుబాటులో లేవు. ముఖ్యంగా మద్యంబాబులు పిచ్చివాళ్లుగా మారిపోతున్నారు. గుక్కెడు మద్యం కోసం తల్లడిల్లిపోతున్నారు. నల్ల మార్కెట్‌లో పలుకుతున్న ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. 
 
మరోవైపు బ్లాక్‌లో మందు దొరుకుతున్నప్పటికీ... దాని ధర చుక్కలను తాకుతోంది. హైదరాబాదులో క్వార్టర్ రూ.140 ఉండే లిక్కర్‌ను బ్లాక్‌లో రూ.750కి అమ్ముతున్నారు. బీరు రూ.400-450 మధ్యలో లభిస్తోంది. ఒక వేళ కొందామని డబ్బు రెడీ చేసుకున్నా.. అది చేతి వరకు వస్తుందో? లేదో? అనే డౌట్. ఈ పరిస్థితి దేశ వ్యాప్తంగా నెలకొనివుంది. 
 
దీంతో ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు... సొంతంగా మందు తయారు చేసుకుంటే పోలా? అని మందుబాబులు ఆలోచిస్తున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా గూగుల్‌లో 'ఇంటి వద్ద ఆల్కహాల్ తయారు చేయడం ఎలా?' అని వెతుకుతున్నారు. మార్చ్ 22 నుంచి 28 వరకు ఆన్‌లైన్ సర్చింగులో ఇదే టాప్ ట్రెండింగ్‌లో ఉంది. 

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments