బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మే 2024 (12:47 IST)

హైటెక్ బెగ్గర్ రాజు బికారీ గుండెపోటుతో మృతి

Begger
Begger
ఎప్పుడూ మెడలో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం క్యూర్‌ కోడ్‌ల ట్యాగ్‌లను వేలాడదీసుకొని స్టేషన్‌లోని ప్రయాణికులను డబ్బు యాచించే హైటెక్ బెగ్గర్ రాజు బికారీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన డిజిటల్‌ ఇండియా స్ఫూర్తితోనే తాను ఈ కొత్త అవతారం ఎత్తాతనని పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. 
 
తాజాగా బెట్టియా రైల్వే స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌లు చూపిస్తూ యాచిస్తుండగానే గుండెపోటు రావడంతో మృతిచెందాడు. అతని మరణవార్త అన్ని హిందీ వెబ్ సైట్లలో ప్రముఖంగా కనిపించింది. యూట్యూబ్ లోనూ పలువురు నెటిజన్లు రాజు భికారీ ఇకలేడంటూ తమ ఆవేదనను పంచుకున్నారు.