Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రమ్‌‌పై ఆశలు వదులుకున్న ఇస్రో..? థ్యాంక్యూ అంటూ ట్వీట్

Updated: గురువారం, 19 సెప్టెంబరు 2019 (17:58 IST)
చంద్రయాన్-2 విక్రమ్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇస్రో. కానీ చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుని సౌత్ పోల్ వద్దకు పంపిన విక్రమ్ లాండర్ ఆచూకీ ఇంకా లభించలేదు. చివరి నిముషంలో లాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో విక్రమ్ జాడ కనుగొనేందుకు నాసా ముందుకు వచ్చింది. 
 
అది దిగినట్లు భావించే ప్రాంతంలో నాసా ల్యూనార్ రికన్నాయిజెన్స్ ఆర్బిటర్ నుంచి ఫోటోలు తీసింది. కానీ వాటిలో ఎక్కడా విక్రమ్ ఆచూకీ కనిపించలేదని, అందువల్లే వాటిని మరింత నిశితంగా పరిశీలించాలనుకుంటున్నామని నాసా వెల్లడించింది.
 
ఫోటోలు తీసే సమయానికి లాండర్ నీడలో ఉండడం గానీ, నిర్దిష్ట ప్రాంతానికి అవతలివైపు ఉండడం గానీ ఉన్నట్టయితే ఈ ఇమేజీల్లో కనిపించవచ్చునని నాసా తెలిపింది. ఆర్బిటర్‌ చంద్రుని ఉపరితలానికి అతి దగ్గర నుంచి ఫొటోలు తీయడం వల్ల నీడ ఎక్కువగా పడిందని నాసా తెలిపింది.
 
నాసా చివరి ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో ఇస్రో 'విక్రమ్ ల్యాండర్‌' పై ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2 ప్రయోగం గురించి తాజాగా ఇస్రో ఓ భావోద్వేగ ట్వీట్ చేసింది. తమకు అండగా నిలిచిన వారందరికీ ఇస్రో ధన్యవాదాలు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలను, ఆకాంక్షలను సాధించే దిశగా ప్రయత్నిస్తూనే ఉంటామని ఇస్రో ట్వీట్‌లో పేర్కొంది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments